మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో నిర్లక్ష్యంగా విధులు నిర్వహించారనే కారణంతో పులివెందుల సీఐ శంకరయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాలు జారీచేశారు. పంచనామా నిర్వహించకుండానే మృతదేహాన్ని వైఎస్ కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తున్నప్పటికీ..అక్కడే ఉన్న సీఐ అడ్డుకోలేకపోయారని ఎస్పీ పేర్కొన్నారు. ప్రస్తుతం వివేకా హత్యకేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.
వివేకానంద రెడ్డి హత్యకేసులో పులివెందుల సీఐ సస్పెన్షన్ - రాహుల్ దేవ్ శర్మ
వివేకానందరెడ్డి హత్యోదంతంలో పులివెందుల సీఐ శంకరయ్య నిర్లక్ష్యంగా వ్యహరించారన్న అభియోగం కింద ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.
పులివెందుల సీఐ శంకరయ్య సస్పెన్షన్