సీపీఎం ఆధ్వర్యంలో.. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి - సీపీఎం
విప్లవ వీరుడు పుచ్చలుపల్లి సుందరయ్య 34వ వర్ధంతిని మైదుకూరు సీపీఎం శాఖ నిర్వహించింది. పూల మాలలు వేసి ఆయన చిత్ర పటానికి నివాళులర్పించారు. సీపీఎం కోసం ఆయన చేసిన సేవలను ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు స్మరించుకున్నారు.
విప్లవ వీరుడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని కడప జిల్లా మైదుకూరులో నిర్వహించారు. సీపీఎం మైదుకూరు శాఖ కార్యదర్శి షరీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పార్టీ నాయకులు, వివిధ విభాగాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్ పుచ్చలపల్లి సుందరయ్య అంటూ నినాదాలు చేశారు. సీపీఎం కోసం సుందరయ్య అందించిన సేవలను పలువురు కొనియాడారు. నాయకులు ఆయన జీవిత చరిత్రను కార్యకర్తలకు వివరించారు. సుందరయ్య స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.