'మురుగు నీటికుంటలతో ప్రజలు రోగాల పాలు'
ఇళ్ల మధ్య మురుగు నీటికుంటలతో ప్రజల ఇబ్బందులు పడుతున్నారు. రోగాలు వ్యాప్తి చెందుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా బద్వేలు వాసులు ఎక్కువగా జ్వరాల బారిన పడుతున్నారు. సమీప ప్రాంతాల్లో కూడా జ్వరాలు ఎక్కువగా ప్రబలుతున్నాయి.
కడప జిల్లా బద్వేలులో నివాసాల మధ్య మురుగు నీటికుంటలతో... విషజ్వరాలు కలుగజేసే దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. దోమల వల్ల రోగాల బారిన పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. ఎక్కువగా చిన్నారులు జ్వరాల బారిన పడడంతో బాధితుల తల్లితండ్రులు ఆవేదన చెందుతున్నారు. సమీప గ్రామీణ ప్రాంతాల్లో కూడా జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. దోమల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టి జ్వరాలు వ్యాప్తి చెందకుండా చూడాలని కోరుతున్నారు.
TAGGED:
fevers