కడప జిల్లా సింహాద్రిపురం మండలం చవ్వావారి పల్లి గ్రామ ప్రజలు రెండు రోజులుగా కొండచిలువ వలన భయంతో గడిపారు. గ్రామ పొలాల్లో సంచరిస్తూ కోడి పిల్లలు, మేక పిల్లలు, కుందేళ్లను తింటూ.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పాములు పట్టే.. రాజా అనే వ్యక్తికి అధికారులు కొండ చిలువను పట్టుకోవాలని చెప్పారు. దాని జాడను కనుక్కొని పట్టుకున్నాడు రాజా. అప్పటికే అది కుందేళును మింగేసింది. తర్వాత కొండ చిలువను అడవిలోకి తీసుకెళ్లి విడిచిపెట్టడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
రాజా వచ్చాడు... కొండ చిలువను పట్టేశాడు! - కడప జిల్లా వార్తలు
కడప జిల్లా సింహాద్రిపురం మండలం చవ్వావారిపల్లిలో కొండచిలువ కలకలం సృష్టించింది. రెండు రోజులుగా ఆ గ్రామ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.
రాజా వచ్చాడు... కొండ చిలువను పట్టేశాడు