ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జమ్మలమడుగులో ఎమ్మార్పీఎస్ నాయకుల ఆందోళన - జమ్మలమడుగు వార్తలు

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రాజగృహాన్ని ధ్వంసం చేసినందుకు నిరసనగా కడప జిల్లా జమ్మలమడుగులో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

kadapa district
జమ్మలమడుగులో ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళన

By

Published : Jul 11, 2020, 10:54 PM IST

కడప జిల్లా జమ్మలమడుగులో పాత బస్టాండ్​లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళన చేశారు. ముంబయిలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రాజగృహాన్ని ధ్వంసం చేసిన వారిపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చొరవచూపి నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేశారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలను కోరారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ABOUT THE AUTHOR

...view details