కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు నిజాయితీగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సూచించారు. అవినీతికి పాల్పడకుండా మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ప్రొద్దుటూరులో మాట్లాడిన ఆయన పోలీసులు అవినీతికి పాల్పడుతున్నారన్న భావన ప్రజల్లో ఉందని ఆరోపించారు.
ఎవరెవరు ఎంత లంచం తీసుకున్నారో తన దగ్గర ఆధారాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై త్వరలోనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి విచారణ చేపట్టాలని కోరతానని వరదరాజులరెడ్డి అన్నారు. పోలీసులు అవినీతికి పాల్పడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.