కడప జిల్లా బద్వేలు ఆర్టీసీ డిపోలో తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపారు. ఈ నెల 19న 'సారథిపై చిన్న చూపు' అనే కథనం ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు.
శీతల పెట్టె చిన్న కారణంగా పని చేయడం లేదని.. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వేసవిలో వేడి నీరు దిక్కు అవుతుందని.. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొనే ఇబ్బందులను విశ్లేషిస్తూ కథనం వచ్చింది. దీనిపై ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస రావు తక్షణం స్పందించారు. శీతల పెట్టే మరమ్మతులు చేయించి చల్లని నీటిని కార్మికులకు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో వేసవిలో కార్మికులు దాహార్తి తీర్చుకుంటున్నారు.