కడప జిల్లా జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రి వైద్యులకు 150 పీపీఈ యూనిట్లు, 900 మాస్కులు వైద్యులకు దాతలు అందించారు. వైకాపా నాయకుడు పి. రామ సుబ్బారెడ్డి చేతులమీదుగా వీటిని అందజేశారు. సుమారు రెండు లక్షల రూపాయల విలువైన ప్రత్యేక దుస్తులను అందజేయడంలో వైద్యులు హర్షం వ్యక్తం చేశారు.
వైద్యులకు పీపీఈ యూనిట్లు, మాస్కులు పంపిణీ - జమ్మలమడుగు కొవిడ్ తాజా వార్తలు
జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రిలో వైద్యులకు పీపీఈ యూనిట్లు, మాస్కులను వైకాపా నాయకుడు పి. రామ సుబ్బారెడ్డి చేతులు మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమాన్ని జమ్మలమడుగు ఆర్డీవో నాగన్న ఆధ్వర్యంలో జరిపారు.
వైద్యులకు మాస్కులు, పీపీఈ యూనిట్లు అందజేస్తున్న మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి