ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో ఆనందయ్య ఔషధం పంపిణీ వాయిదా - Postponement of distribution of Anandayya medicine news

కడప జిల్లాలో ఆనందయ్య మందు పంపిణీ వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూర్తి స్థాయిలో ఔషధం తయారీ కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Anandayya medicine
ఆనందయ్య ఔషధం తయారీ

By

Published : Jun 8, 2021, 3:30 PM IST

కడప జిల్లాలో ఆనందయ్య మందు పంపిణీ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. నగరంలోని స్విస్ట్ కళాశాలలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజోలి వీరా రెడ్డి సమక్షంలో ఆనందయ్య మందు తయారీ, పంపిణీకి సన్నాహాలు జరిగాయి. వనమూలికలు, ఇతర సామాగ్రి అన్నీ సిబ్బంది సిద్ధం చేసి పెట్టారు. ఈ రోజే పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టినా.. పూర్తి స్థాయిలో ఔషధం తయారీ కాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆనందయ్య ఔషధం పంపిణీ చేస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details