కడప జిల్లాలో ఉద్రిక్తం.. వృద్ధుల ఓట్లు వేసిన సెక్టోరల్ అధికారి - rajampeta
కడప జిల్లా రాజంపేట మండలం చవనవారిపల్లి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బందితో స్థానికులు ఘర్షణకు దిగారు. వృద్ధుల ఓట్లను వైకాపాకు అనుకూలంగా వేస్తున్నారంటూ వారు ఆందోళన చేశారు.
కడప జిల్లాలో పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం
కడప జిల్లా రాజంపేట మండలం చవనవారిపల్లి పోలింగ్ కేంద్రంలో సెక్టోరల్ అధికారితో ఓటర్లు ఘర్షణకు దిగారు. వృద్ధుల ఓట్లు వేసే అధికారం సెక్టోరల్ అధికారికి ఎక్కడిదని వారు ప్రశ్నించారు. పోలింగ్ కేంద్రంలో వైకాపా, తెదేపా ఏజెంట్లు వాగ్వాదానికి దిగారు. రాజంపేట సీఐ నర్సింహులు పోలింగ్ కేంద్రానికి చేరుకుని, సెక్టోరల్ అధికారిని అక్కడినుంచి పంపించి వేయడంతో గొడవ సద్దుమణిగింది.