ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SP Reaction: వివేకా కుమార్తె లేఖకు ఎస్పీ స్పందన.. సునీత ఇంటి వద్ద పికెట్ ఏర్పాటు! - Police picket at Viveka's daughter's house

వివేకా కుమార్తె ఇంటి వద్ద పోలీస్ పికెట్
వివేకా కుమార్తె ఇంటి వద్ద పోలీస్ పికెట్

By

Published : Aug 13, 2021, 7:20 PM IST

Updated : Aug 13, 2021, 7:55 PM IST

19:18 August 13

సునీత ఇంటి వద్ద భద్రత

వివేకా కుమార్తె ఎస్పీకి రాసిన లేఖ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రాసిన లేఖపై కడప ఎస్పీ అన్బురాజన్ స్పందించారు. పులివెందులలోని సునీత ఇంటి వద్ద వెంటనే పోలీస్‌ పికెట్ ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. సునీత లేఖలోని ఇతర అంశాలపైనా విచారణ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అంతకుముందు...

తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని వివేకా కుమార్తె సునీత కడప ఎస్పీ అన్బురాజన్​కు ఈ మధ్యాహ్నం లేఖ రాశారు. వెంటనే భద్రత కల్పించాలని కోరారు. ఈ నెల 10న మణికంఠరెడ్డి అనే వ్యక్తి రెక్కీ చేశాడని లేఖలో వెల్లడించారు. మణికంఠరెడ్డిని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనుచరుడుగా సునీత ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తండ్రి హత్య కేసులో ప్రధాన అనుమానితుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనుచరుడు రెక్కీ నిర్వహించటం అనుమానాలకు తావిస్తోందన్నారు. సీసీ టీవీ దృశ్యాల ద్వారా అనుమానితుడిని గుర్తించామని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె ఎస్పీని కోరారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ, డీజీపీ, సీబీఐ అధికారులకు సునీత లేఖలతో పాటు సీసీ కెమెరా దృశ్యాల పెన్​డ్రైవ్​లు పంపారు.

ఇదీ చదవండి:

Letter: మాకు ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించండి: కడప ఎస్పీకి వివేకా కుమార్తె లేఖ

Last Updated : Aug 13, 2021, 7:55 PM IST

For All Latest Updates

TAGGED:

sp

ABOUT THE AUTHOR

...view details