కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలు మండలం ఎల్లమరాజు చెరువులో ఓ వ్యక్తి ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చెరువులో పడిన వ్యక్తి వంశీకృష్ణ (27)గా పోలీసులు గుర్తించారు. అతని కోసం అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు వెతకడం ప్రారంభించారు. చెరువు లోతులో ఉన్నందున అతని ఆనవాళ్లు దొరకలేదని అధికారులు తెలిపారు. చీకటి పడినందున గాలింపు చర్యలు తాత్కాలికంగా నిలిపేశారు. తిరిగి ఉదయాన్నే ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు.
ఈతకు వెళ్లి వ్యక్తి గల్లంతు... గాలిస్తున్న అధికారులు - kadapa district latest news
చిట్వేలు మండలం ఎల్లమరాజు చెరువు నందు ఈతకు వెళ్లి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. చీకటి పడినందున తాత్కాలికంగా నిలిపేశారు. తిరిగి శనివారం ఉదయాన్నే ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
ఈతకు వెళ్లిన వ్యక్తి గల్లంతు