సంక్రాంతి సందర్భంగా రాయచోటిలోని పోలీసులు సంప్రదాయ దుస్తులు ధరించి విధులకు హాజరయ్యారు. పట్టణ డీఎస్పీ పరిధిలోని సీఐ, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పంచెకట్టుతో పోలీస్‌స్టేషన్‌కు రావటంతో వారిని జనం ఆసక్తిగా తిలకించారు. సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నదే తమ అభిమతమని పోలీసులు పేర్కొన్నారు.
సంక్రాంతి సందర్భంగా పంచెకట్టుతో రాయచోటి పోలీసుల విధులు - rayachoti police latest news
సంక్రాంతి పండగను పురస్కరించుకుని కడప జిల్లా రాయచోటిలో పోలీసులు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. సీఐ, ఎస్సై సహా సిబ్బంది పంచకట్టులో పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు.
పంచెకట్టుతో రాయచోటిలోని పోలీసులు