ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 20, 2020, 6:37 AM IST

ETV Bharat / state

ప్రొద్దుటూరులో ట్రాన్స్ జండ‌ర్స్​కు పోలీసుల కౌన్సిలింగ్...

రోడ్లపై వెళ్లే వాహ‌న‌దారుల నుంచి కొంద‌రు ట్రాన్స్ జండ‌ర్స్ దౌర్జ‌న్యంగా డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారనే ఫిర్యాదులు అధికంగా వ‌స్తున్నాయ‌ని క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు డీఎస్పీ సుధాక‌ర్ అన్నారు. దాన్ని అరిక‌ట్టేందుకు ప‌ట్ట‌ణంలోని ఉన్న ట్రాన్స్ జండ‌ర్స్‌తో రెండో ప‌ట్ట‌ణ పోలీస్ స్టేష‌న్‌లో ఆయ‌న స‌మావేశం నిర్వ‌హించారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహ‌న‌దారుల‌ను ఇబ్బందుల‌కు గురిచేయడం మంచిదికాద‌న్నారు. అన్ని ఎన్జీవో సంస్థ‌ల‌తో మాట్లాడి ట్రాన్స్ జెండ‌ర్స్‌కు ఉపాధి క‌ల్పించే విష‌యంపై చర్చిస్తామ‌ని డీఎస్పీ చెప్పారు. ట్రాన్స్ జెండ‌ర్స్ ఆత్మ‌గౌర‌వంతో జీవించాల‌ని సూచించారు. ప్ర‌జ‌లూ వారికి చేయూత‌నివ్వాల్సిన అవ‌స‌రం ఉందని అభిప్రాయ‌ప‌డ్డారు. డీఎస్సీ ఇచ్చిన సూచ‌న‌లను త‌ప్ప‌క‌ పాటిస్తామ‌ని ట్రాన్స్ జండ‌ర్స్ అన్నారు.

Police counseling for transgenders in Proddutur
ప్రొద్దుటూరులో ట్రాన్స్ జండ‌ర్స్​కు పోలీసుల కౌన్సిలింగ్

..

ప్రొద్దుటూరులో ట్రాన్స్ జండ‌ర్స్​కు పోలీసుల కౌన్సిలింగ్...

ABOUT THE AUTHOR

...view details