కడప జిల్లా రాజంపేట మండలం బాదనగడ్డపై నిర్మించిన అన్నమయ్య జలాశయం ద్వారా చెయ్యేరు నదికి నీటిని విడుదల చేయాలని దిగువ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. చెయ్యేరు నదిపై అన్నమయ్య జలాశయాన్ని నిర్మించక ముందు రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాలకు తాగు, సాగునీటి సమస్య ఉండేది కాదని నందలూరు ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా తాగునీరు అవసరాల నిమిత్తం జలాశయం నుంచి కొంత నీటిని నదిలోకి విడుదల చేయాల్సి ఉన్నా.... అలా జరగడం లేదని ప్రజలు అంటున్నారు. ఇప్పటికే చెయ్యేరు నదిపై ఉన్న మంచినీటి పథకాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, ఇలాగే కొనసాగితే గుక్కెడు నీటికి ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నమయ్య నీరు వదలక చెయ్యేరు కన్నీరు - చెయ్యేరు నది వార్తలు
అన్నమయ్య జలాశయం నుంచి దిగువకు నీరు విడుదల చేయకపోవటంతో చెయ్యేరు నది పరివాహక ప్రాంతంలో తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏడాదికి రెండుసార్లు జలాశయం నుంచి ఈ నదికి నీరు విడుదల చేయాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ అది అమలు కావటం లేదు.
annamaiah reservoir