URUSU CELEBRTAIONS : ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. ఉరుసులో చివరి ఘట్టమైన ఊరేగింపు ఆదివారం రాత్రి 11 గంటలకు మొదలై.. తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కొనసాగింది. పెద్ద దర్గా పీఠాధిపతిని రథంపై కూర్చోబెట్టి ఊరేగించారు. ఇసుక వేస్తే రాలనంతగా.. భారీ సంఖ్యలో భక్తులు ఊరేగింపునకు హాజరయ్యారు.
అంగరంగ వైభవంగా కడప పెద్ద దర్గా ఉరుసు.. - darga urusu celebrations at Kadapa
PEDDA DARGA URUSU CELEBRATIONS : రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకల్లో చివరి ఘట్టమైన ఊరేగింపు ఆదివారం రాత్రి 11 గంటలకు మొదలై తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కొనసాగింది.
PEDA DARGA URUSU CELEBRATIONS
డప్పుల మోత, యువత కేరింతల మధ్య ఊరేగింపు ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. వివిధ రకాల టపాసులను పేల్చారు. పీఠాధిపతిని చూసేందుకు భక్తులు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: