నేడు, రేపు కడపలో జనసేనాని - kadapa
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇవాళ, రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లా పర్యటన ముగించుకుని సాయంత్రం కడప చేరుకుంటారు. రేపు ఉదయం విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. మార్చి 1న చిత్తూరు జిల్లా వెళ్తారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. కర్నూలు జిల్లా పర్యటన నేటితో ముగియనుంది. అనంతరం కడప జిల్లా చేరుకుంటారు. అక్కడ 2 రోజులు పర్యటిస్తారు.అన్నమయ్య కూడలిలో సాయంత్రం 4 గంటలకు పవన్ కల్యాణ్ రోడ్ షో ఉంటుంది.రాత్రికి కడపలోనే బస చేస్తారు.రేపు రాజంపేట, కోడూరు మీదుగా పవన్ కల్యాణ్ యాత్ర సాగనుంది. ఉదయం విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. తర్వాత రాజంపేటలో రోడ్డు షో, రైల్వే కోడూరులో బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసగింస్తారు.మార్చి1న చిత్తూరు జిల్లాకు వెళ్లనున్నారు.