Parents complain against teacher: వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో వెన్నెల అనే విద్యార్థిని 9వ తరగతి చదువుతోంది. తరగతిలో ఫ్యాన్ వేసినందుకు ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణ .. ఆ విద్యార్థిని కొట్టాడు. విషయం తెలుసుకున్న వెన్నెల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటపై అమ్మాయి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సీలింగ్ ఫ్యాన్ వేస్తే కొడతారా? అని ప్రశ్నించారు. గతంలో లాక్ డౌన్ సమయంలో కోడిగుడ్లను సరిగా ఇవ్వకపోవడంతో ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణయ్య సస్పెండ్ అయ్యారు. ఆ సమయంలో వెంకటరమణకు ఉన్నతాధికారి సహకరించి అదే పాఠశాలలో పోస్ట్ ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థిని అనవసరంగా కొట్టినందుకు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఫ్యాన్ వేసినందుకు విద్యార్థిని కొట్టిన టీచర్..
case against a teacher in AP: వైఎస్ఆర్ కడప జిల్లాలోని వేంపల్లిలోని పాఠశాలలో ఫ్యాన్ వేసినందుకు.. ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణ.. వెన్నెల అనే విద్యార్థిని కొట్టాడు. విషయం తెలుసుకున్న వెన్నెల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటపై విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో సైతం అతనిపై అనేక అరోపణలు ఉన్నప్పటీకి అధికారులు అతనికి సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
విద్యార్థిని కొట్టిన టీచర్