విద్యకు పేదరికం ఏ మాత్రం అడ్డు కాకూడదన్నదే.. ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. జగనన్న విద్యా దీవెన కార్యక్రమం నిర్వహించగా.. ఉప ముఖ్యమంత్రి అంజాద్తో పాటు జేసీలు గౌతమి (రెవెన్యూ), ధర్మ చంద్రారెడ్డి (సంక్షేమం) హాజరయ్యారు. హాజరయ్యారు. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే జమ చేశారు.
మెగా చెక్కు రూపంలో..
2020-21 విద్యా సంవత్సరానికి మొదటి విడతగా జిల్లాలోని 72 వేల 39 మంది విద్యార్థులకు మంజూరైన " జగనన్న విద్యా దీవెన " మొత్తాన్ని రూ. 45 కోట్ల 63 లక్షల 38 వేల 505లను మెగా చెక్కు రూపంలో.. అంజాద్ బాషాతో కలిసి జేసీలు ఎం.గౌతమి, ధర్మ చంద్రా రెడ్డి, విద్యార్థుల తల్లులకు అందజేశారు.