ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిరాడంబరంగా ఒంటిమిట్టలో సీతారామకల్యాణం - వైభవంగా ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణోత్సవం

కరోనా నేపథ్యంలో తొలిసారిగా భక్తులకు అనుమతి లేకుండానే కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ అందజేశారు

వైభవంగా ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణోత్సవం
వైభవంగా ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణోత్సవం

By

Published : Apr 8, 2020, 3:15 AM IST

Updated : Apr 8, 2020, 8:58 AM IST

నిరాడంబరంగా ఒంటిమిట్టలో సీతారామకల్యాణం

రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో ఏటా ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నకడపజిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం ఈసారి నిరాడంబరంగా జరిగింది. తొలుత ఎదుర్కోలు ఉత్సవం.. నేత్రపర్వంగా సాగింది. శ్రీరాముడిని ఊరేగింపుగా సీతమ్మవద్దకు తీసుకొచ్చి ఎదుర్కోలు నిర్వహించారు.

అనంతరం తితిదే వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పరిణయం జరిపించారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివార్లకు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. పట్టువస్త్రాలు, పుష్పమాలికలతో ముస్తాబైన సీతారాములకు.. తితిదే పండితులు మాంగళ్యధారణ కార్యక్రమం నిర్వహించారు.

చంద్రుడి కోరిక మేరకే శ్రీరాముడు పౌర్ణమి రోజు రాత్రి వేళ కల్యాణం జరుపుకుంటున్నారనే ఆనవాయితీని కొనసాగించిన తితిదే అధికారులు కరోనా వైరస్‌ ప్రభావంతో భక్తులు, ప్రజాప్రతినిధులను పరిణయ మహోత్సవానికి అనుమతించలేదు. కేవలం ఎస్వీబీసీ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు

ఇవీ చదవండి

కరోనా నివారణకు శ్రమిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు: పరిటాల సునీత

Last Updated : Apr 8, 2020, 8:58 AM IST

For All Latest Updates

TAGGED:

ontimitta

ABOUT THE AUTHOR

...view details