బధిరుడైన ఆ వ్యక్తికి తన లోపమే శాపంగా మారింది. రైలు వస్తున్నా.. ఆ శబ్దం వినిపించక పట్టాలు దాటడానికి ప్రయత్నించాడు. వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయవిదారక ఘటన కడప జిల్లా రాజంపేట రైల్వే గేటు వద్ద జరిగింది. తుమ్మల అగ్రహారానికి చెందిన రవికి మూగ, చెవుడు. భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. పని కోసమని రాజంపేట వచ్చాడు. రైల్వేగేటు వద్ద వస్తున్న రైలును గమనించక పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగింది. మృతుడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలున్నారు. స్టేషన్ వద్ద ఉన్న అండర్ బ్రిడ్జి పూర్తికాకపోవటం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
లోపమే శాపమై.. రైలు ఢీకొని బధిరుడు మృతి - dumb and def person died at rajampeta
ఆ వ్యక్తికి ఉన్న లోపమే అతని ప్రాణాలు తీసింది. బధిరుడైన రవి అనే వ్యక్తి రైలు వస్తున్న శబ్ధం వినిపించక పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కడప జిల్లా రాజంపేటలో జరిగింది.
రైలు ఢీకొట్టి బధిరుడు మృతి