కడప జిల్లా రైల్వేకోడూరు మండలం జ్యోతికాలనీ ప్రధాన రహదారిపై సోమవారం అర్ధరాత్రి ఓ లారీ, ఐసర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన సుబ్బమ్మ (65), మృతి చెందగా ఆమె అల్లుడు లారీ డ్రైవర్ విజయభాస్కర్ గాయపడ్డారు. సుబ్బమ్మ తన అల్లుడితో కలిసి ఐసర్ వాహనంలో తిరుపతి వెళ్తుండగా రైల్వేకోడూరు మండలం జ్యోతికాలనీ ప్రధాన రహదారి వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొంది. వారిరువురిని 108 వాహనంలో తిరుపతి రుయా హాస్పిటల్‌కి తరలించారు. సుబ్బమ్మ చికిత్సపొందుతూ మరణించినట్లు రైల్వేకోడూర్ ఎస్సై వెంకట నరసింహం చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి - kadapa district latest news
కడప జిల్లా రైల్వేకోడూరు మండలం జ్యోతికాలనీ ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు మృతిచెందింది.
రోడ్డు ప్రమాదం