కడప జిల్లా కమలాపురం మండలంలో ఇవాళ ఒక్కరోజే 74 కేసులకు నమోదయ్యాయి. కరోనా సోకిన వారికి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల నుంచి నమూనాలు సేకరించడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సచివాలయ ఉద్యోగుల పనితీరు మెరుగుపడాలని స్థానికులు సూచించారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలున్నా తమ దృష్టికి లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎంఆర్వో విజయ్ కుమార్ స్థానికులకు తెలిపారు.
'ఎలాంటి సమస్యలున్నా అధికారుల దృష్టికి తీసుకురావాలి' - కమలాపురంలో స్థానికులతో అధికారుల సమావేశం
కమలాపురంలో స్థానికులు అధికారుల తీరును విమర్శించారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నా అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే స్థానికులతో సమావేశమైన అధికారులు... సమస్యలను తమ దృష్టికి కానీ పోలీసుల దృష్టికి కానీ తీసుకురావాలని సూచించారు.
కమలాపురంలో ఎలాంటి సమస్యలున్న అధికారుల దృష్టికి తీసుకురావాలి