కడప జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటపై కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం పడింది. నిత్యం పర్యటకులు, ప్రజలతో కళకళలాడే గండికోట.. నేడు వెలవెలబోతోంది. ప్రతి శని, ఆదివారాల్లో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి భారీగా పర్యటకులు తరలివచ్చేవారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో కోట నిర్మానుష్యంగా మారింది. ఈ పరిస్థితి ఇంకెనాళ్లు కొనసాగుతుందో అర్థం కాకుండా ఉంది.
అప్పుడు కళకళ.. ఇప్పుడు వెలవెల - corona effect on gandikota
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం కడప జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గండికోటపై పడింది. ప్రస్తుతం పర్యటకులు లేక కోట పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి.
గండికోటకు కరోనా ప్రభావం