కడప జిల్లాలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు పదిహేను వందల నమూనాలు సేకరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 94వేల 814 శాంపిల్స్‌ను సేకరించారు. కరోనా వ్యాప్తి పెరగటంతో ప్రజలే స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవటానికి రావటంతో పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడుతుంది. కొన్ని చోట్ల సాయంత్రం వరకు పరీక్ష కేంద్రాలను తెరవకపోవటంతో ప్రజలు పడిగాపులు కాస్తున్నారు.
ఇలా అయితే లేని కరోనా వచ్చేటట్లు ఉంది! - kadpa covid test centers news
ప్రతి చోటా భౌతిక దూరం పాటించే కడప ప్రజలు... కరోనా టెస్టులు చేయించుకోవటానికి వచ్చినప్పుడు మాత్రం పాటించటం లేదు. గుంపులు గుంపులుగా తమ వంతు వచ్చేవరకు ఎదురుచూస్తున్నారు. దీని వల్ల వైరస్ వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం ఉంది.
మరికొన్ని చోట్ల ఆన్లైన్ ఇబ్బందులు తలెత్తటంతో పరీక్షలు నత్తనడకన సాగుతున్నాయి. దీనివలన ప్రజలంతా గుంపులు గుంపులుగా తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. పరీక్షల కోసం వచ్చినవారు భౌతిక దూరం పాటించకపోవటం... మాస్కులు సైతం అలంకారప్రాయంగా ధరిస్తుండటంతో వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. మరికొన్ని పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:రోడ్డు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేయండి