కడప జిల్లా బద్వేలు బాలుర ఉన్నత పాఠశాల మొదటి మోడల్ స్కూల్‌గా ఉన్నా.. అంచెలంచెలుగా ఎదిగి జిల్లా పరిషత్ ఉన్నత స్థాయికి ఎదిగింది. తరగతి గదులు నిర్మించి అరవై ఏళ్లు అవుతుండటంతో శిథిలావస్థకు చేరాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి తదితర పథకాల వల్ల ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఫుల్.. కూర్చోడానికి గదుల్లేవ్ - schools
పాలకులు, అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. కడప జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదుల కొరత విద్యార్థులను వేధిస్తోంది.
no-class-rooms-in-government-schools
ప్రస్తుతం ఈ పాఠశాలలో 1500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లాలోనే విద్యార్థుల సంఖ్యలో మొదటి స్థానంలో నిలిచింది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ పాఠశాలలో తరగతి గదుల కొరత ఉంది. చదువు సక్రమంగా చెప్పలేకపోతున్నామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరగతి గదిలో సాధారణంగా 40 మంది విద్యార్థులు ఉండాలి. అలాంటిది.. రెట్టింపు స్థాయిలో విద్యార్థులను కూర్చోబెట్టి బోధించాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి వసతులు కల్పించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.