ఈ నెల 19న కడపజిల్లా సీకే దిన్నె గ్రామంలో సాంబశివారెడ్డి అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు బుసిరెడ్డి ఈశ్వరెడ్డితో పాటు ఆయన వర్గానికి చెందిన మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు కడప డీఎస్పీ సునీల్ తెలిపారు. బుసిరెడ్డి ఈశ్వర్ రెడ్డి, చెన్నూరు సాంబశివారెడ్డి వర్గాలకు గత కొంత కాలంగా పొలం తగాదా కొనసాగుతోంది. దీనిపై కోర్టులో కూడా కేసు నడుస్తోంది. అయితే ఈనెల 19న ఈ రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఆ రోజు సాయంత్రం సాంబశివారెడ్డి ఇంటిపైకి బుసిరెడ్డి ఈశ్వర్ రెడ్డి వర్గం వెళ్లి దాడి చేసింది. సాంబశివారెడ్డిని కత్తితో పొడవడం, కర్రలతో దాడి చేయడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందినట్లు డీఎస్పీ తెలిపారు. ఈకేసులో ఏడుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హజరు పరుస్తామన్నారు. నిందితుల నుంచి మారణాయులు, గొడ్డళ్లు, కత్తులు, కర్రలు స్వాధీనం చేసుకున్నారు.
సాంబశివారెడ్డి హత్యకేసులో ఏడుగురు నిందితుల అరెస్ట్
కడప జిల్లా చింతకొమ్మదిన్నెకు చెందిన సాంబశివారెడ్డి హత్యకేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కడప డీఎస్పీ సునీల్ తెలిపారు. వీరి నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులందరిని కోర్టులో హాజరుపరుస్తున్నామన్నారు.
సాంబశివారెడ్డి హత్యకేసులో ఏడుగురు నిందితులు అరెస్ట్