చైనా - భారత్ దేశ సైనికుల ఘర్షణలో అమరులైన జవాన్లకు రైల్వేకోడూరు పట్టణంలోని ముస్లింలు నివాళులర్పించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ, మన తెలుగు బిడ్డ సంతోష్‌కుమార్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. జాతీయ జెండా చేతబట్టి రైల్వేకోడూరులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద అసువులు బాసిన భారతదేశం ముద్దుబిడ్డలు అమర జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం చైనా దేశ అధ్యక్షుడు చిత్రపటాన్ని దహనం చేశారు.
అమరులైన సైనికులకు ముస్లింల నివాళి - kadapa district
భారత్ - చైనా సరిహద్దులో చైనా సైనికుల ఘర్షణలో అమరులైన భారత సైనికులకు కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ముస్లింలు నివాళులర్పించారు.
అమరులైన సైనికులకు నివాళులర్పించిన ముస్లింలు