సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ కడప నగరపాలక కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఆఫీసు ప్రధాన ద్వారాన్ని మూసి కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కనీస వేతనం 18000 రూపాయలు ఇవ్వాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి జీతాలు పెంచుతామని చెప్పి.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. మున్సిపల్ కార్మికులకు ఇవ్వాల్సిన నూనె, చెప్పులు తదితర సామాగ్రిని పంపిణీ చేయలేదన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సమాన పనికి సమాన వేతనం కోసం మున్సిపల్ కార్మికుల ధర్నా
కనీస వేతనం 18000 రూపాయలు ఇవ్వాలంటూ కడపలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. నగరపాలక కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ మున్సిపల్ కార్మికుల ధర్నా