STATE MRPS PRESIDENT : రాష్ట్రంలో మాదిగ కులస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఆంధ్రప్రదేశ్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ ఆరోపించారు. రోజురోజుకు మాదిగలపై దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని.. పైగా పోలీసులు కేసులు కూడా నమోదు చేయడం లేదని ఆయన ఖండించారు. మాదిగలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కడప కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బహుజనుల మహాసంకల్పం పేరిట ధర్నా చేపట్టారు.
'మాదిగలపై దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు'
MRPS STATE PRESIDENT DANDU VEERAIAH : రాష్ట్రంలో రోజురోజుకు మాదిగలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం, పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ మండిపడ్డారు. మాదిగలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కడప కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బహుజనుల మహాసంకల్ప పేరిట ధర్నా చేపట్టారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సీ ఎస్టీ కేసుల్లో పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చే 41 సీఆర్పీ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనివలన నిందితులకు శిక్షలు పడడం లేదని ఆరోపించారు. అర్హులైన పేదలకు అసైన్మెంట్ కమిటీ ద్వారా మూడు ఎకరాల భూమిని పంపిణీ చేయాలని కోరారు. ఐదవ తరగతి ఆపై చదువులు చదువుతున్న విద్యార్థులకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత భీమా పథకం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రంజాన్, క్రిస్మస్ పండుగలకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కూడా వారం రోజులు సెలవులు ప్రకటించాలని కోరారు.
ఇవీ చదవండి: