కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాశ్‌రెడ్డి భూమి పూజలు నిర్వహించారు. పులివెందులలో 10 కోట్లతో మినీ సెక్రటేరియట్, అంతర్జాతీయ స్థాయిలో హై స్కూల్, మోడల్ పోలీస్‌స్టేషన్, పైర్ స్టేషన్, నూతన బిల్డింగుల నిర్మాణానికి భూమిపూజ చేశారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ అవినాశ్ శ్రీకారం - mp avinash starts some works
సీఎం జగన్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టి అర్హులందరికీ అందేలా కృషిచేస్తున్నారన్నారని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన భూమి పూజలు నిర్వహించారు.
బెస్తవారిపల్లె, తొండూరు, ఇప్పట్లలోని బాలయోగి గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూర్చడానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ... నియోజకవర్గంలో 28 కోట్ల 34 లక్షల విలువవైన పనులకు శ్రీకారం చుట్టామన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టి అర్హులందరికీ చేరేలా కృషిచేస్తున్నారన్నారు. ఈ ఏడాది చివరి నాటికి గండికోట ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నింపి జిల్లాను సస్యశామలం చేస్తామన్నారు.
TAGGED:
mp avinash starts some works