పసిడి వర్తకానికి ప్రఖ్యాతిగాంచిన కడప జిల్లా ప్రొద్దుటూరులో మరో ఐపీ బాంబు పేలింది. పాత మార్కెట్ సమీపంలో ఉన్న ఎన్ఎస్ కాంప్లెక్స్‌లో 15 ఏళ్లుగా బంగారు వ్యాపారం నిర్వహిస్తున్న ఓ వర్తకుడు తలకు మించిన అప్పులు చేయడంతో ఊబిలో చిక్కుకున్నాడు. బంగారం వ్యాపారానికి తోడు ఇతర అవసరాల కోసం రూ.10 కోట్ల మేర అప్పులు చేసినట్లు తోటి వారంటున్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో తిరిగి ఇవ్వలేదని, ఉన్న ఆస్తులు కూడా అంతంతమాత్రమే అవడంతో రుణదాతలు అతనిపై ఒత్తిడి చేశారు. దాంతో సాధారణంగా రోజూ దుకాణం తెరిచి వ్యాపారం చేయాల్సిన వ్యక్తి, నిన్న మధ్యాహ్నం నుంచి తలుపులు మూసి వేయడంతో రుణదాతల్లో ఆందోళన మొదలైంది. సాయంత్రం అప్పులు ఇచ్చినవారు దుకాణం వద్దకు చేరుకుని ఆరా తీయగా, యజమాని పరారీలో ఉన్నట్టు తెలిసింది. ఓ రుణదాత తీవ్ర స్థాయిలో తన బాకీ రాబట్టుకునేందుకు ప్రయత్నించడం, ఓ దశలో దాడిచేయడంతో అతను కనబడకుండా వెళ్లినట్లు తోటి వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడాయన ఐపీ ఆలోచనలో ఉన్నట్లు ప్రొద్దుటూరులో చర్చనీయంశమైంది.
ఆ వ్యాపారి అప్పు తీరుస్తారా... ఐపీ పెడతారా!? - kadapa
కడపలో ఓ నగల వ్యాపారి ఐపీ పెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఆయన అందుబాటులో లేకపోవడం... ఆ ఆరోపణలకు బలాన్నిస్తుంది. ఇంతకీ ఆయన అప్పు తీరుస్తారా.. లేక ఐపీ పెడతారా!?
అప్పులు కట్టలేక ఐపీ వేస్తున్న వ్యాపారి