మోదీని జగన్ ఎందుకు ప్రశ్నించట్లేదు...? - shasana mandali
ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు దిల్లీలో చేస్తున్న ధర్మపోరాట దీక్షకు మద్దతుగా.... పులివెందులలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి దీక్ష చేపట్టారు.
శాసన మండలి డిప్యూటీ చైర్మన్
By
Published : Feb 11, 2019, 4:25 PM IST
శాసన మండలి డిప్యూటీ చైర్మన్
సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం దిల్లీలో చేస్తున్న ధర్మపోరాట దీక్షకు మద్దతుగా... కడప జిల్లా పులివెందులలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి దీక్ష చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. మోదీతో ప్రతిపక్ష నేత జగన్ లోపాయకారీ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కడప జిల్లా అభివృద్ధి కోసం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. ఏపీకి అన్యాయం చేసిన మోదీని... జగన్ ఎందుకు ప్రశ్నించట్లేదని నిలదీశారు.