కడప జిల్లా రైల్వే కోడూర్ నియోజకవర్గంలోని పుల్లంపేట మండలంలోని రెడ్ జోన్‌ను ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు పరిశీలించారు. పుల్లంపేట మండలంలో పాజిటివ్ వచ్చిన సందర్భంగా ఈరోజు మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో అధికారులు, వైద్యులు, ఆశా వర్కర్లతో ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు సమావేశమయ్యారు. ప్రతిరోజు గ్రామంలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయాలని అధికారులకు సూచించారు. ఏ ఒక్కరూ భయపడనవసరం లేదన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం కావాల్సిన చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. కరోనా వైరస్ గురించి ప్రజలెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవలసిందిగా కోరారు.
పుల్లంపేట వైద్యులు, అధికారులతో సమావేశమైన ప్రభుత్వ విప్ - pullameta latest covid news
పుల్లంపేటలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన సందర్భంగా ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, అధికారులు, ఆశా వర్కర్లతో సమావేశమయ్యారు. కరోనా వ్యాప్తి నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
వైద్యులు, అధికారులతో సమావేశమైన ప్రభుత్వవిప్ శ్రీనివాసులు