బ్రహ్మంగారి పీఠంపై మళ్లీ వివాదం మెుదలైనట్టు తెలుస్తోంది. కుటుంబసభ్యులు, అధికారుల సమక్షంలోనే ఏకాభిప్రాయాని వచ్చినట్లు వైకాపా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి(mla raghuramareddy) తెలిపారు.
మారుతి మహాలక్ష్మమ్మపై ఎవరూ ఒత్తిడి తీసుకురాలేదన్నారు. కోర్టుకు ఎందుకు వెళ్లారో అర్థంకావట్లేదని వెల్లడించారు. కోర్టు తీర్పు రేపు వస్తుందని అనుకుంటున్నామన్న ఎమ్మెల్యే.. తీర్పును ప్రభుత్వం శిరసావహిస్తుందని స్పష్టం చేశారు.