కరోనా వైరస్ నియంత్రణ, ప్రభుత్వ పథకాలు అమలులో విశేష కృషి చేసిన కడప జిల్లా మైదుకూరు మండలంలోని వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే రఘురాం రెడ్డి చేతుల మీదుగా బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సిబ్బంది సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. ప్రభుత్వ పాలనను ప్రజల దగ్గరికి చేర్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సచివాలయ వ్యవస్థతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకతీతంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సేవలు అందేలా చూడాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఎంతైనా ఉందన్నారు.
వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి సరుకులు పంపిణీ - కడపలో నిత్యావసర సరుకులు పంపిణీ తాజా వార్తలు
కడప జిల్లా మైదుకూరు మండలంలోని వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి గురువారం ఎమ్మెల్యే రఘురాం రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సిబ్బంది పనితీరును కొనియాడారు.
వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే సరుకులు పంపిణీ