మైదుకూరు ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. నగరంలో నమోదైన 4 పాజిటివ్ కేసు బాధితులు డిశ్చార్జ్ కావడం.. దుకాణాదారుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకొని అన్నిరకాల దుకాణాలు తెరిపించేలా ప్రయత్నం చేస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నెల 14న ఆటోవాలాలు, నాయీ బ్రాహ్మణులకు పదివేల రూపాయల చొప్పున ప్రభుత్వం సహాయం అందజేయనున్నట్లు తెలిపారు.
ఆగస్టు 3న పాఠశాలలను పున ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నాడు - నేడు కింద చేపట్టిన పనులన్నింటినీ పూర్తి చేసిలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ నెల 30న ప్రారంభించే రైతు భరోసా కేంద్రాల ద్వారా క్రిమిసంహారక మందులు, ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు రఘురామిరెడ్డి స్పష్టం చేశారు.