కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా నేత నందం సుబ్బయ్య హత్యను ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై రుద్దడం దారుణమని వైకాపా రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే రాచమల్లు నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాచమల్లుకు హత్యా రాజకీయాలు నడిపిన చరిత్ర లేదని స్పష్టం చేశారు. సుబ్బయ్య చేసిన అవినీతి... తెదేపా నేతలకు తెలుసని వ్యాఖ్యానించారు. హత్యకు ఎమ్మెల్యేకి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.
'రాచమల్లుకు హత్యా రాజకీయాలు నడిపిన చరిత్ర లేదు'
తెదేపా నేత నందం సుబ్బయ్యను ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హత్య చేయించారని ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను వైకాపా రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి తప్పుబట్టారు. రాచమల్లుకు హత్యా రాజకీయాలు నడిపిన చరిత్ర లేదన్నారు.
akepati amarnath reddy