కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వైద్యుల పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి సమయానికి రాలేదని ఇలా అయితే ఎలా అని వైద్యులను నిలదీశారు. ఆసుపత్రి వెనుక ఉన్న ఆయుష్ రూమ్‌లో ఉన్న రోగుల గురించి... ఈనాడు పేపర్ కథనం వచ్చినా స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయుష్ రూమ్‌లో ఉన్న రోగులకు చికిత్స అందించాలని సూచించారు. ఆసుపత్రి నుంచే కలెక్టర్ హరికిరణ్‌తో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే... ఆసుపత్రి పనులు త్వరతిగతిన పూర్తి చేసి, రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.
ప్రభుత్వ వైద్యుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం - ఎర్రగుంట ఆసుపత్రిలో ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి
టైమ్‌కి రాకపోతే ఎలా? ఈనాడు పేపర్లో వచ్చినా స్పందించకపోవటం ఏంటి అంటూ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి కడప జిల్లా ఎర్రగుంట ప్రభుత్వం ఆసుపత్రి వైద్యులపై మండిపడ్డారు.
ప్రభుత్వ వైద్యుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం