ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజలు మళ్లీ తెదేపానే కోరుకుంటున్నారు: సోమిరెడ్డి - తెలుగుదేశం

కడప జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని చెర్లోపల్లిలో మంత్రి సోమిరెడ్డి ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను గూర్చి వివరిస్తున్నారు. సైకిల్ గుర్తుకు ఓటేసి తెదేపాను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

చెర్లోపల్లి ఎన్నికల ప్రచారంలో మంత్రి సోమిరెడ్డి

By

Published : Mar 31, 2019, 7:59 PM IST

చెర్లోపల్లి ఎన్నికల ప్రచారంలో మంత్రి సోమిరెడ్డి
గోదావరి, పెన్నా నదుల అనుసంధానం మొదటి దశ మొదలైందని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. కడప జిల్లా అభివృద్ధి చెందేందుకు ఇది దోహదపడుతుందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని చెర్లోపల్లిలో ఎన్నికల ప్రచారం చేసిన సోమిరెడ్డి... తెదేపా మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. సంక్షేమ పథకాల అమలులో... ఏ ప్రభుత్వం సాధించని ఘనత తెదేపా ప్రభుత్వం చేసి చూపిందన్నారు. సర్వేపల్లిలో వైకాపా అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ రాత్రి 12గంటల వరకు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారని సోమిరెడ్డి అన్నారు.

ఇవీ చూడండి.

ABOUT THE AUTHOR

...view details