కడప జిల్లా కమలాపురంలో జరగబోయే నగర పంచాయతీ ఎన్నికలపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఆదిమూలపు సురేశ్ సమీక్షించారు. వైకాపా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని మంత్రి సురేశ్ అన్నారు. అన్ని వర్గాల వారికి సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని చెప్పారు. కమలాపురం అభివృద్ధికి వందల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని వెల్లడించారు. జరగబోయే ఎన్నికలో ప్రతి వార్డులోనూ వైకాపా గెలుపునకు నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలిచేందుకు తెదేపా ఎన్ని కుట్రలు చేసినా... వైకాపా గెలుపును ఆపలేరని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు.
కమలాపురంలో వైకాపా గెలుపునకు కృషి చేయాలి: మంత్రి సురేశ్ - ఏపీ వార్తలు
కమలాపురం నగర పంచాయతీ ఎన్నికలో వైకాపా గెలుపునకు పార్టీ నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి సురేశ్ పిలుపునిచ్చారు. ఎన్నికలపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషాతో కలిసి సమీక్షించిన ఆయన.. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

minister adimulapu suresh