ఉపాధి కోసం వలసవచ్చిన ఓ తాపీ మేస్త్రీ చెట్టుకు తన లుంగీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాకలోని శ్మశానవాటికలో జరిగింది. మృతి చెందిన వ్యక్తి కర్నూలు జిల్లా పాపిలి మండలం కలిచెట్ల గ్రామానికి చెందిన నాగరాజు(36)గా పోలీసులు గుర్తించారు. తన భార్యా పిల్లలతో రాజంపేటకు వలస వచ్చి తాపీ పని చేసుకుంటూ జీవించేవాడని మన్నూరు ఎస్సై షేక్ రోషన్ తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సైతెలిపారు.
చెట్టుకు ఉరివేసుకుని తాపీమేస్త్రీ ఆత్మహత్య - రాజంపేట మండలం తాజా ఆత్మహత్య వార్తలు
కడప జిల్లా తాళ్లపాకలోని శ్మశానంలో చెట్టుకు తాపీ మేస్త్రీ నాగరాజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
లుంగీతో చెట్టుకు ఉరివేసుకుని తాపీమేస్త్రీ ఆత్మహత్య