ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భాకరాపేటలో వైద్యశిబిరం - విషజ్వరాలు

కడప జిల్లా బద్వేలు పురపాలికలోని భాకరాపేటలో విషజ్వరాల విజృంభణపై 'ఈనాడు-ఈటీవి భారత్'లో ప్రచురితమైన కథనానికి స్పందించిన డీఎంహెచ్​వో... వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

భాకరాపేటలో విజృంభిస్తున్న విషజ్వరాలు

By

Published : Feb 25, 2019, 10:22 AM IST

భాకరాపేటలో విజృంభిస్తున్న విషజ్వరాలు

కడప జిల్లా బద్వేలు పురపాలికలోని భాకరాపేటలో 10 రోజులుగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఊరంతా విషజ్వరాలు వ్యాపించాయి. స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రతీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు మంచంపట్టారు. దీనిపై 'ఈనాడు-ఈ టీవి భారత్'లో వచ్చినకథనాలకు జిల్లా యంత్రాంగం స్పందించింది.జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి భాకరాపేటలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

భాకరాపేటలో 70 కుటుంబాలు ఉన్నాయి. 10 రోజులుగా తీవ్రమైన తలనొప్పి... ఒళ్ళు నొప్పులు... జ్వరంతో ప్రజలు బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం చేయించుకోలేని ఆ నిరుపేదలు ప్రభుత్వ సాయం కోసం చూస్తున్నారు.

బద్వేలు పురపాలక శివారు వార్డు భాకరాపేటలో... పారిశుద్ధ్యనిర్వహణ అధ్వానంగా ఉంది. ప్రజలు వాడుకున్న నీరు మురుగు కాల్వల్లో నిలిచి... దోమలు పెరిగాయి. స్థానిక ప్రజాప్రతినిధులు... పురపాలక అధికారులకు విన్నవించినా ఫలితం లేదని భాకరాపేట వాసులు వాపోతున్నారు. అధికారులు స్పందించి పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని... దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details