కడప జిల్లా కాకర్లవారిపల్లిలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రాజాతో నాగమణికి 10 ఏళ్ల కిందట వివాహమైంది. అనంతరం జీవనోపాధి నిమిత్తం భార్యాభర్తలిద్దరూ...కువైట్ వెళ్లి ఈ మధ్యే స్వగ్రామానికి తిరిగివచ్చారు. పెళ్లయి ఇన్నేళ్లైనా... వారికి సంతానం కలగలేదు. ఆమె భర్త మరో పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పిన పరిస్థితుల్లో నాగమణి మనస్తాపానికి గురైనట్టు ఆమె తమ్ముడు పోలీసులకు ఫిర్యాడు చేశాడు. ఒంటిపై కిరోసన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మృతురాలు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోగా.. ఆమెకు తమ్ముడు మాత్రమే ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
వివాహిత ఆత్మహత్య.. అత్తింటి వేధింపులేనని తమ్ముడి ఆరోపణ - వివాహిత ఆత్మహత్య
కడప జిల్లా కాకర్లవారిపల్లిలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పిల్లలు పుట్టటం లేదని భర్త, అత్తమామలు వేధింపులు గురి చేసిన కారణంగానే ఈ ఘటనకు పాల్పడిందని మృతురాలి తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వివాహిత ఆత్మహత్య