ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి: మంగంపేట గ్రామస్థులు

ఏపీఎమ్​డీసీ వద్ద మంగంపేట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వటం లేదని వారు ఆరోపించారు. తమకు పునరావాసం కల్పించి.. ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

agitation
మంగంపేట గ్రామస్తుల ఆందోళన

By

Published : Jul 27, 2020, 9:02 PM IST

కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట గ్రామస్థులు ఏపీఎమ్​డీసీ ముగ్గురాయి మైన్​ వద్ద ఆందోళన చేశారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ, మంగంపేట నిర్వాసితుల సంక్షేమ సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. స్థానికులకు కాకుండా ఇతరులకు ఉద్యోగాలు ఇస్తున్నారంటూ గ్రామస్థులు ఆరోపించారు. ఏపీఎండీసీ కోసం తమ భూములు, ఇళ్లను కోల్పోయిన తమకు కాకుండా వేరేవాళ్లకు ఉద్యోగాలు ఎలా ఇస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్ కాలుష్యం వలన మంగంపేట, కాపుపల్లి, అరుంధతివాడ, అగ్రహారంలను డేంజర్ జోన్ గ్రామాలుగా గుర్తించి... సంవత్సరం గడుస్తున్నా పునరావాసం కల్పించలేదని వాపోయారు. బాధిత గ్రామస్థులకు పునరావాసం కల్పించి... ఉద్యోగాలు కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details