కడప జిల్లా లంకమల అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం అక్రమరవాణాకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన ఓ కూలీని మైదుకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కారుతో పాటు 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
మరో 11 మంది కూలీలు పరారైనట్లు డీఎస్పీ విజయ్‌కుమార్ వెల్లడించారు. పరారైన వారితో పాటు, దందా వెనక ఉన్నవారిని అరెస్ట్ చేస్తామన్నారు. ఎర్రచందనం అక్రమరవాణాకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ హెచ్చరించారు.