ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సగిలేరు'... జలకళలో సరిలేరు! - కడప జిల్లాలోని సగిలేరు జలాశయం

నీటి పారుదల శాఖ అధికారులు రైతుల తాగు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు... కడప జిల్లాలోని దిగువ సగిలేరు జలాశయం నుంచి నీటిని వదిలారు.

lower-sagilure-project-in-kadapa-district
సగిలేరు జలాశయం నుంచి చెరువులకు నీరు విడుదల

By

Published : Dec 20, 2019, 9:36 PM IST

సగిలేరు జలాశయం నుంచి చెరువులకు నీరు విడుదల

తాగు, సాగు నీటి అవసరాలు తీర్చేందుకు నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వరుణుడు కరుణించగా.. ఈ ఏడాది కడప జిల్లాలోని దిగువ సగిలేరు ప్రాజెక్టుకు తెలుగుగంగ ప్రాజెక్టు నుంచి నీటిని వదిలారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు దిగువ సగిలేరు కింద ఉన్న చెరువుల్లో జలకళ ఉట్టిపడుతోంది. కుడి, ఎడమ కాలువలకు సంబంధించి 36 గొలుసు చెరువులు ఉన్నాయి. దాదాపు 18వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇటీవల అధికారులు బద్వేలు నియోజకవర్గంలోని బి.కోడూరు మండల పరిధిలోని చెరువులకు ఎడమ కాలువ ద్వారా నీటిని మళ్లించారు. ఇప్పటికే పలు చెరువులు నిండాయి. కరవు రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు.

ABOUT THE AUTHOR

...view details