ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒంటిమిట్ట ఉత్సవాల్లో సింహవాహనంపై అలరించిన స్వామి వారు - ontimitta vuttachavalu

కడపజిల్లా ఒంటిమిట్ట ఆలయంలో రాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామి వారు సింహవాహనంపై దర్శనమిచ్చారు. కరోనా కారణంగా ఉత్సవాలను తితిదే ఏకాంతంగా నిర్వహిస్తోంది.

vontimitta vutchavalu
ఒంటిమిట్ట ఉత్సవాల్లో సింహవాహనంపై అలరించిన స్వామి వారు

By

Published : Apr 23, 2021, 10:38 PM IST


కడపజిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య వైభవంగా తితిదే నిర్వహిస్తోంది. సింహ వాహనంపై స్వామి, అమ్మవార్లు దర్శనమిచ్చారు. ఒంటిమిట్టలో మూడవరోజు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి ఉత్సవాల్లో సింహవాహనంపై స్వామి వారు సీతా, లక్ష్మణ సమేతంగా దర్శనమిచ్చారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహన సేవ నిర్వహించారు. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను స్వామివారు శిక్షించటానికి ప్రతీకగా సింహవాహనంపై దర్శనమిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details