ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం అక్రమ రవాణాపై ఎస్​ఈబీ అధికారుల దాడులు

కడప, కర్నూలు జిల్లాల్లో నాటుసారా తయారీ, అక్రమ మద్యం రవాణా, విక్రయం చేస్తున్న వారిపై ఎస్​ఈబీ అధికారులు జులుం విధిల్చారు. కర్నూలు జిల్లాలో 54 మందిని అరెస్ట్​ చేయగా... కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఓ వ్యక్తిని అరెస్ట్​ చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధిస్తామని పోలీసులు హెచ్చరించారు.

liquor caught at kadpa kurnool districts by seb officers
కడప, కర్నూలు జిల్లాలో మద్యం అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకున్న ఎస్​ఈబీ అధికారులు

By

Published : Aug 10, 2020, 7:15 PM IST

కడప, కర్నూలు జిల్లాల్లో మద్యం అక్రమరవాణా, నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు చేశారు.

కర్నూలు జిల్లాలో..

జిల్లావ్యాప్తంగా నాటుసారా విక్రయం, మద్యం అక్రమరవాణాపై నిఘా పెట్టిన ఎస్​ఈబీ అధికారులు సోమవారం 54 మందిని అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి 115 లీటర్ల నాటుసారా, 1913 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. 25 వాహనాలను సీజ్​ చేశారు.

కడప జిల్లాలో..

జిల్లా అదనపు ఎస్పీ ఆదేశాల మేరకు రైల్వేకోడూరు మండలంలో ఎస్​ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో మద్యం విక్రయాలు చేస్తున్న శాంతినగర్​కు చెందిను సుగవాసి ప్రభాకర్​ రెడ్డిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇతని వద్ద నుంచి 12 మద్యం బాటిళ్లను స్వాధీనం చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్​ నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చదవండి :

తడలో అక్రమ మద్యం నిల్వలను పట్టుకున్న పోలీసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details