ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SUCIDE ATTEMPT: ఉన్నతాధికారి వేధింపులు తాళలేక.. లైన్​ ఇన్​స్పెక్టర్​ ఏం చేశాడంటే..! - కడప జిల్లా నేర వార్తలు

ఉన్నతాధికారి వేధింపులు తాళలేక లైన్​ఇన్‌స్పెక్టర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కడప జిల్లాలో జరిగింది. బాధితుడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

లైన్​మెన్ ఆత్మహత్యాయత్నం
లైన్​మెన్ ఆత్మహత్యాయత్నం

By

Published : Sep 12, 2021, 7:05 PM IST

Updated : Sep 12, 2021, 7:47 PM IST

లైన్ఇన్‌స్పెక్టర్‌ ఆత్మహత్యాయత్నం

కడప జిల్లా వీరపునాయునిపల్లిలో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషగుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. ఎర్రగుంట్ల ఉన్నతాధికారి ఏడీఈ నరసింహారెడ్డి వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు రమేష్ లేఖలో రాశాడు. ఆ కుటుంబ సభ్యులు రమేష్ ను వెంటనే ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రమేష్ ను చూసి కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు .

Last Updated : Sep 12, 2021, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details